అధిక వర్షాల కారణంగా శ్రీకాకుళంలో నీట మునిగిన ప్రాంతాలను ఎమ్మెల్యే గుండు శంకర్ బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. శ్రీకాకుళం మున్సిపాలిటీ అధికారులతో చర్చించి తగు సూచనలు అందించారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని దీనికి కొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు.. కేంద్రమంత్రికి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చం నాయుడు, జిల్లా కలెక్టర్ కు పరిస్థితులను వివరిస్తానని వీలైనంత త్వరలో ఈ సమస్యకు పరిష్కారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు..