మంచిర్యాల జోన్ పోలీసు అధికారులతో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన జూలై నెల సమీక్షా సమావేశంలో సీపీ అంబర్ కిషోర్ ఝా పదేపదే నేరాలకు పాల్పడేవారిపై 'గ్యాంగ్ ఫైల్స్' ఓపెన్ చేయాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తులో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక, శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.