Download Now Banner

This browser does not support the video element.

కరీంనగర్: ప్రేమించాలని ఓ మైనర్ బాలికను వేధిస్తున్న పోకిరికి కరీంనగర్ పట్టణంలో కుటుంబు సభ్యులు దేహశుద్ధి..పోలీసుల అరెస్ట్

Karimnagar, Karimnagar | Aug 29, 2025
కరీంనగర్ పట్టణంలోని కోర్ట్ సమీపంలో ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్న ఓ పోకిరి కి బాలిక కుటుంబ సభ్యులు శుక్రవారం మధ్యాహ్నం దేహశుద్ధి చేశారు. చొప్పదండి నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను కొంతకాలంగా ఆర్నకొండ గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో వెంబడిస్తున్నట్టు ఆ బాలిక కుటుంబ సభ్యులకు తెలపగా, శుక్రవారం కోర్టు సమీపంలో బాలిక వెళుతుండగా ఆ పోకిరి మళ్లీ వెంబడించాడు. అప్పటికే మా సభ్యులు దూరం నుంచి గమనిస్తూనే ఉంటూ ఆ పోకిరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పచెప్పారు.
Read More News
T & CPrivacy PolicyContact Us