జాతీయ రహదారిపై భీమడోలు కనకదుర్గమ్మ ఆలయం వద్ద తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై సోమవారం ఎంపీటీసీ ముళ్లగిరి జాన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాంగ్ రూట్ ప్రయాణం వల్ల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని ఆయన అన్నారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం తహశీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ పద్మావతిదేవిలకు వినతిపత్రం అందజేశారు.