గురువాయిగూడెం వద్ద జంగారెడ్డిగూడెం -ఏలూరు రోడ్ లో గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి బుధవారం సాయంత్రం రాస్తారోకో నిర్వహించారు. సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించాలని, సర్వీస్ రోడ్ లో మొక్కలు, చెట్లు వేయవద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, గ్రీన్ ఫీల్డ్ హైవే భూనిర్వాసిత రైతులు పోరాట కమిటీ నాయకులు వామిశెట్టి హరిబాబు మాట్లాడుతూ గురవాయిగూడెం ఎగ్జిట్ పాయింట్ వద్ద సర్వీస్ రోడ్డుకి అవకాశం లేకుండా హైవే నిర్మాణం చేశారని చెప్పారు. తమ పొలాలకు రైతులు ఏవిధంగా వెళ్లాలని ప్రశ్నించారు.