మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నిరుపేదలైన లబ్ధిదారులకు, ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ,లబ్ధిదారులకు పట్టాలు అందజేసి, భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు .