భారీ వర్షాల కారణంగా రేపటి నుంచి నిర్వహించాల్సిన మండల స్థాయి క్రీడా పోటీలను వాయిదా వేస్తున్నట్లు మండల విద్యాధికారి విద్యాసాగర్ బుధవారం తెలిపారు. పోటీల నిర్వహణకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన అన్నారు. మండలంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన పేర్కొన్నారు.