ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని రాచర్ల పారం గ్రామం సమీపంలో గురువారం చిరుత పులి సంచారాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో అటవీశాఖ అధికారులు చిరుత పులి పాద ముద్రలు గుర్తించి పులి సంచారాన్ని నిర్ధారించారు. అయితే అది పెద్దపులి పాదముద్రలు లాగా ఉన్నాయని కానీ చిరుత పులి లాగానే ఉన్నట్లుగా అనుమాన వ్యక్తం చేస్తున్నారు. రైతులు, పశువుల కాపర్లు ఒంటరిగా చిరుత పులి తిరుగుతున్న ప్రాంతానికి రావద్దని పశువులను సురక్షితమైన ప్రాంతాలలో ఉంచాలని అటవీ శాఖ అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.