శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం మదిరేబైలు తండాకు చెందిన వేణునాయక్ (13) పుట్టుకతోనే దివ్యాంగుడు. తమ బాబుకు 100% వైకల్యం ఉన్నా.. 70% మాత్రమే ఉన్నట్లు సదరం సర్టిఫికెట్ ఇచ్చారని తండ్రి వాపోయారు. దీంతో రూ.6వేల పెన్షన్ మాత్రమే వస్తోందని తల్లిదండ్రులు శంకర్, సరస్వతీ ఆవేదన వ్యక్తం చేశారు. బాబుపూర్తి బెడ్ రెస్టులో ఉంటున్నాడని రూ.15 వేల పెన్షన్కి అర్హుడన్నారు. ప్రభుత్వం కనికరించాలని కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.