పెద్ద కడబూరు:ఆలూరు మండలం మనెకుర్తిలో శ్రీ భక్త కనకదాసు విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేయాలని కురువ సంఘం మండల అధ్యక్షుడు మల్లికార్జున డిమాండ్ చేశారు. శుక్రవారం పెద్ద కడబూరులో కురువ సంఘం నాయకులు మాట్లాడుతూ కురవల ఆరాధ్య దైవమైన భక్త కనకదాసు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది పిరికిపందల చర్య అన్నారు. పోలీసులు తక్షణమే నిందితులను అరెస్టు వారి కోరారు.