వినాయక చవితి పండుగను పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం సందడి నెలకొంది. ఉదయం నుండి కొత్త బస్టాండ్, గాంధీ చౌక్, పాత బస్టాండ్ ప్రాంతాల్లో పూజ సామాగ్రి, గణపతి విగ్రహాలకు, పూలు పండ్లు కొరకు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. వినాయకునికి సమర్పించే పూజా సామగ్రిని కొనుగోలు చేయడానికి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. ఉదయం నుండి వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.