రేపు సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ఉన్న సందర్భంగా ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ పేట జిల్లాలో మిలాద్ ఉన్ నబీ పండుగ ర్యాలీని శాంతి యుతంగా జరుపుకోవాలని ఆదివారం 4 గం. సమయంలో ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లిం కమిటీ సభ్యులు ర్యాలీని శాంతియుతంగా జరుపుకోవాలని పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని ట్రాఫిక్ డైవర్షన్ చేయడం, పోలీస్ పికేట్స్ ఏర్పాటు, ప్రధాన చౌరస్తాలలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. కులమతాలకతీతంగా పండుగలు నిర్వహించుకోవాలని సూచించారు.