జగ్గంపేట మండలంలో నిర్వహించే వినాయక చవితి నిమజ్జన వేడుకలలో వినాయక కమిటీ సభ్యులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నడుచుకోవాలని జగ్గంపేట ఎస్సై టీ రఘునాధరావు అన్నారు. జగ్గంపేట స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగ్గంపేట పరిసర ప్రాంతాలలో గణపతి నవరాత్రి మహోత్సవాలకు, నిమజ్జన సమయంలో డీజే లకు అనుమతి లేదన్నారు.