తిరుపతి జిల్లా వెంకటగిరి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా దర్శన టిక్కెట్లను ఎమ్మెల్యే కురుగొండాల రామకృష్ణ బుధవారం విడుదల చేశారు. 100,300 రూపాయల విలువైన టిక్కెట్లను పోలేరమ్మ ఆర్చి సెంటర్ వద్ద ప్రారంభించి, మొదటగా ఆయనే కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో జాతర నిర్వహణ కమిటీ సభ్యులు, దేవస్థానం ఈవో, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జాతరలో భక్తుల సౌకర్యార్థం టిక్కెట్లను అందుబాటులో ఉంచామని నిర్వాహకులు తెలిపారు