చెన్నూరు పట్టణంలోని ఎస్బిఐ బ్యాంకులో క్యాషియర్ రవీందర్ అవకతవకలకు పాల్పడినట్లు సిపి అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితుడి వద్ద నుంచి బంగారం, నగలు రికవరీ చేశామని పేర్కొన్నారు. నిందితుడు బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి బ్యాంకులో డబ్బును వాడుకున్నాడని తెలిపారు. మెల్లమెల్లగా బంగారం తీసుకొని, ప్రైవేటు బ్యాంకులో కుదపెట్టి వాడుకునే వాడని వెల్లడించారు. ఈ కేసులో 47 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.