కడపజిల్లా కమలాపురం నియోజకవర్గం వీరపునాయన పల్లె మండలం పరిధిలో ఆదివారం ఎస్పి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మద్యం అక్రమ విక్రయాలపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. వీరపునాయునిపల్లి మండలంలోని గోనామాకులపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం అక్రమంగా మద్యం విక్రయిస్తున్న రామకృష్ణ అనే వ్యక్తి వద్ద నుండి 17 క్వార్టర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మంజునాధ్ తెలిపారు. మండలంలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.