కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సోమవారం నాలుగు గంటల సమయంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి ఎమ్మెల్యే మాటలు సరైనవి కావన్నారు. అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరారు.. కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి ప్రజల బాధలను తీర్చే మాటలను మాట్లాడాలి కానీ ప్రజలను బాధలకు గురి చేసే మాటలు మాట్లాడడం సరైనది కాదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని కోరారు.