నంద్యాలలోని ఖాదర్ బాగ్ మున్సిపల్ పాఠశాల యందు 2025-26 సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ తరఫున ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ ప్రారంభిస్తున్నట్లు HM గురురాజా తెలిపారు. 14 సంవత్సరాలు నిండి, ఎటువంటి విద్యార్హతలు లేని వారు ఓపెన్ పదో తరగతికి, 10వ తరగతి విద్యార్హత కలిగి ఉన్నవారు ఓపెన్ ఇంటర్కు అప్లై చేసుకోవచ్చని వెల్లడించారు. రూ.200 అపరాధ రుసుంతో ఈనెల 15 వరకు అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నారు.