ఫ్లాష్ ఫ్లాష్... #. చిన్న పాండురు మాతమ్మ గుడి మలుపు వద్ద రోడ్డుకు అడ్డంగా దిగబడిపోయిన రెండు లారీలు @. వరదయ్యపాలెం మండలం చిన్నపాండూరు అరుంధతి వాడ మాతమ్మ గుడి మలుపు వద్ద రోడ్డుకు ఇరువైపులా రెండు భారీ లారీలు దిగబోటుకు గురయ్యాయి. దీంతో రోడ్డుకి ఇరువైపులా కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరాయి.దీంతో వాహనాల్లో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అసలే చీకటి సమయం కావడంతో వాహనాలు అటు ఇటు వెళ్లలేక ..బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఇతర చిన్నపాటి వాహనాలో ఉన్న ప్రయాణికులు, అలాగే పరిశ్రమలకు వెళ్లి తిరిగి ఇళ్ళకు వెళ్లాల్సిన కార్మికులు సైతం ఇళ్లకు వెళ్లలేక అవస్థలు పడుతున్నారు.