ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు నెల రెండవ తేదీన రైతులకు అందజేయనున్న అన్నదాత సుఖీభవ పథకానికి సుమారుగా ఏర్పాట్లు పూర్తి అయ్యాయని వ్యవసాయ శాఖ జె డీ కే త్రినాధ స్వామి తెలిపారు... గురువారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేటలో ఆయన మాట్లాడుతూ.. ఈ పథకానికి రెండు లక్షల 82 వేల రైతులను సుమారుగా గుర్తించడం జరిగింది అన్నారు...ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే అన్ని ప్రక్రియలు పూర్తి చేసామని ఇంకా ఏమైనా ఉన్నట్లయితే దానిపై దృష్టి సారిస్తామని అన్నారు.