ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని ప్రజలకు ఎస్సై బ్రహ్మనాయుడు పలు సూచనలు చేశారు. వినాయక మండపాలను ఏర్పాటు చేసుకునే వారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని తెలిపారు. కమిటీ సభ్యుల వారి ఆధార్ కార్డు వివరాలను పోలీస్ స్టేషన్లో నమోదు చేయాలన్నారు. మండపాలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అశ్లీల నృత్యాలు తదితర కార్యక్రమాలు నిషేధించడం జరిగిందన్నారు. వినాయక విగ్రహాలు ఏర్పాటు నుండి నిమజ్జనం వరకు కమిటీ బాధ్యత వహించాలని కోరారు. పోలీసు వారి నిబంధనల అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.