కడప జిల్లా కమలాపురం మండలంలోని రామచంద్రాపురం గ్రామ సమీపంలో స్నేహితుల మధ్య మాట మాట పెరగడంతో గొడవకు దారి తీయడంతో యువకునిపై కత్తితో దాడి చేసిన ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం తెల్సిన సమాచారం మేరకు కమలాపురం మండలం చదిపిరాళ్లకు చెందిన శివారెడ్డికి, వల్లూరు మండలం పెద్దపుత్తకు చెందిన గోవర్దన్రెడ్డి రూ. 4,500 బాకీ ఉన్నాడు. ఆ డబ్బు సోమవారం ఇస్తానని చెప్పేందుకు ఆదివారం రామచంద్రాపురం వద్ద ఉన్న శివారెడ్డికి చెందిన ఎద్దుల షెడ్డు వద్దకు గోవర్ధన్ రెడ్డి వెళ్లాడు. అలా కుదరదని నాకు అవసరం ఉందని ఇవ్వాలని శివారెడ్డి అడిగారు.