26.08.2025 జిల్లాలోని కొల్లిపర పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తోట గ్రామంలో ఒంటరిగా నిద్రిస్తున్న (78) సంవత్సరాల వృద్ధ మహిళ బుల్లిముంత బుల్లెమ్మ పై కుంచపు దుర్గాప్రసాద్, కొత్తపల్లి ఎలీషా అనే ఇద్దరు నిందితులు ఇనుప రాడ్డుతో దాడి చేసి వృద్ధురాలు మెడలో ఉన్న రూ.13 లక్షల విలువైన 160 గ్రాముల బంగారాన్ని దోపిడీ చేసి పరారైనట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. సోమవారం సాయంత్రం నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో గల కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడారు.