ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజక వర్గ పరిధిలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఆదివారం భారీగా నిర్వహించారు ఐదు రోజులపాటు పూజలందుకున్న ఘననాధులను సముద్ర చీర ప్రాంతాలలో నిమజ్జనం చేశారు. ప్రధానంగా ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని కొత్తపట్నం ఈతముక్కల మరియు మడనూరు ప్రాంతాలలో నిమజ్జన కార్యక్రమాలను ఎక్కువగా నిర్వహించారు. ఇదే సమయంలో ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడకుండా మరియు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలో చేసుకోకుండా పోలీసులు పట్టిష్ట భద్రతా చర్యలను చేపట్టారు. నిమజ్జన ప్రాంతాలలో సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి పటిష్ట నిఘాతో నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చూశారు.