రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అంబులెన్సు దోపిడిని ప్రభుత్వం తక్షణమే అరికట్టే చర్యలు చేపట్టాలని శ్రీ గోదావరి అంబులెన్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ బొంత శ్రీహరి డిమాండ్ చేశారు. బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అధిక ధరలకు అంబులెన్స్ నిర్వహిస్తున్న వారి దందాతో మా యూనియన్ కు ఏ విధమైన సంబంధం లేదని స్పష్టం చేశారు . ప్రభుత్వం ఈ దోపిడీ నరకడం ఎందుకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.