సత్యవేడు విద్యుత్ శాఖ ఏఈగా వి. వాసుదేవయ్య సత్యవేడు విద్యుత్తు ఆపరేషన్ సెక్షన్ కార్యాలయ అసిస్టెంట్ ఇంజినీర్ గా ( ఏఈ) వి. వాసుదేవయ్య బాధ్యతలు స్వీకరించారు. ఏర్పేడులో విద్యుత్ శాఖ ఏఈగా వాసుదేవయ్య పనిచేస్తూ గత కొంతకాలంగా సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో సెలవు ముగియడంతో వాసుదేవయ్య బదిలీపై సత్యవేడు విద్యుత్ శాఖ ఏఈగా నియమితులయ్యారు.