ముత్తుకూరులోని ఏపీ జెన్కో కార్యాలయం ఎదుట టిడిపి నేతలు ఆందోళన చేపట్టారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. జెన్కో కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు టిడిపి నేతలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో జెన్కో కార్యాలయాన్ని టిడిపి నేతలు పగలగొట్టారు. ఈ ఘటన గురువారం ఉదయం 11 గంటలకు జరిగింది.