నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం పరిటాలలో ఘర్షణలు పునరావృతం కాకుండా చూస్తానని నందిగామ ఏసిపి తిలక్ హామీ ఇచ్చారు. వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఇరు వర్గాలకు సర్ది చెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిన అనంతరం శనివారం రాత్రి 9:00 సమయంలో ఆయన మాట్లాడారు.