బిజెపి నాయకులు మతిబ్రమించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పై విమర్శలు చేస్తున్నారని రాయదుర్గం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌని ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం మద్యాహ్నం రాయదుర్గంలో ఆయన మాట్లాడుతూ ఓట్ చోరీలో అడ్డంగా దొరికిపోయారని, బిజెపి వారు చేస్తున్న మోసాలు బట్టబయిలు చేస్తున్న విషయం జీర్ణించుకోలేక రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.