మహిళల భద్రత కోసం నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి రజియా సుల్తానా తెలిపారు బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ. స్త్రీ శక్తి పథకం కింద జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో మహిళల భద్రత కోసం జిల్లా కలెక్టర్ రాజకుమారి 22 సీసీ కెమెరాలను మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు అలాగే నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాల ఆర్టీసీ బస్టాండ్కు ఆర్ఓ ప్లాంట్ ను శాంక్షన్ చేసినట్లు ఆమె వివరించారు