చిలకలూరిపేట మండలంలోని రాజపేట పంచాయతీ పరిధిలో ఉన్న 23 ఎకరాల 70 సెంట్ల భూమికి సంబంధించి శుక్రవారం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన వేలంపాటలో రైతుల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. వేలం పాటలో పాల్గొన్న రైతులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో అధికారులు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిచే ప్రయత్నం చేశారు.