బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం గ్రామంలో పాముకాటుకు గురై శనివారం లలిత (45) మృతి చెందింది. కూలీ పనుల కోసం పొలానికి వెళ్లిన లలితను పాము కాటు వేసింది. వెంటనే ఆమెను స్థానికులు చండ్రాజుపాలెం ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్య లో మరణించిందని వైద్యులు నిర్ధారించారు.