కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల శివారులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కామారెడ్డి పట్టణానికి చెందిన హనుమాన్లు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మాచరెడ్డి మండలానికి చెందిన పండరి అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలైన వ్యక్తిని స్థానికులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి మాచారెడ్డి పోలీసులు చేరుకొని సమీక్షిస్తున్నారు.