ఏలూరు మాజీ MLA అంబికా కృష్ణ బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వరాహ స్వామి దేవస్థానం 9 గంటలకే మూసేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రాత్రి 1 గంట వరకు అవకాశం ఇస్తున్నారన్నారు. వరాహ స్వామి దేవస్థానాన్ని భక్తుల దర్శనార్థం రాత్రి 11 గంటల వరకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.