తాడికల్ గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి యువకుడికి తీవ్ర గాయాలు.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ శివారులో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది.వివరాలలోకి వెళితే గొల్లపల్లి తరుణ్ సోమవారం తెల్లవారుజామున తాడికల్ గ్రామ శివారులోని రైస్ మిల్ వద్ద బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడ్డాడు. కరీంనగర్ నుండి వరంగల్ వెళ్తుండగా బైక్ అదుపు తప్పి కింద పడిపోవడంతో తరుణ్ తలకు తీవ్ర గాయమై, కాళ్లు, చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. అతని స్నేహితుడు అరవింద్ క్షేమంగా ఉన్నాడు. స్థానికంగా ఉన్న వారు 108 సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని తరుణకు ప్రథమ చికిత్స అందించి, కరీ