Download Now Banner

This browser does not support the video element.

పెబ్బేరు: అఖిలభారత ఒంగోలు జాతి పశు బల ప్రదర్శనను ప్రారంభించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి

Pebbair, Wanaparthy | Jan 29, 2025
వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో వెలసిన శ్రీ చౌడేశ్వరీ దేవి జాతర ఉత్సవాలు బుధవారం మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాలకు ప్రారంభమయ్యాయి. జాతర సందర్భంగా అంతరాష్ట్ర బండలాగుడు పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ప్రారంభించారు.కర్ణాటకతోపాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి వృషభాలు తరలివచ్చాయి. పోటీలను చూడడానికి ప్రజలు ఎగబడ్డారు. సందడి వాతావరణం నెలకొంది. మూడు రోజుల పాటు పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us