అల్లూరి జిల్లా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా యువత స్థానిక ప్రజలు రాత్రి 11 తర్వాత సరైన గుర్తింపు కార్డుతో మాత్రమే రోడ్లపైకి రావాలని అనవసరంగా రోడ్లపై తిరగవద్దు అంటూ అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సూచించారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పాడేరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా, పలు అసాంఘిక కార్యక్రమాలు, మావోయిస్టు కార్యకలాపాలు వంటివి కొనసాగే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాలు పోలీసులు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారని, ప్రజలంతా వారికి సహకరించాలని ఎస్పి సూచించారు.