సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వెంకట రాజ్యం మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యంగా నాలుగు ప్రధాన కార్మిక కోడ్‌లను ప్రవేశపెట్టి గతంలో అమలులో ఉన్న అనేక కార్మిక హక్కులను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటోందని విమర్శించారు.ఈ నాలుగు కార్మిక కోడ్‌లు వేతన కోడ్ పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత కోడ్, మరియు ఉద్యోగ ఆరోగ్య, భద్రత, పనిదిన నిబంధనలు అనేవి కార్మికులకు వ్యతిరేకంగా ఉండేలా తయారయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.