తిరుపతి జిల్లా గూడూరును జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ప్రభుత్వ ఉపాధ్యాయ ఐక్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేశారు. గత ప్రభుత్వం అన్యాయంగా వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతిలో గూడూరును కలిపిందన్నారు. దీనితో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని.. దీనికి పరిష్కారంగా గూడూరును జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్కి వినతిపత్రం అందించారు.