బిచ్కుందలో అక్రమ ఇసుక ట్రాక్టర్ ల పట్టివేత అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని బిచ్కుంద తహసిల్దార్ వెను గోపాల్ తెలిపారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం లోని పుల్కల్, హస్గుల్ మంజీర నది ప్రాంతాల నుండి అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్ లను ఆయన పట్టుకున్నారు. అనంతరం ట్రాక్టర్ లను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.