సంపూర్ణ చంద్రగ్రహణం అనంతరం సోమవారం ఉదయం మహానంది పుణ్యక్షేత్రంలో ఘనంగా సంప్రోక్షణ పూజలు చేశారు. వేద పండితులు బ్రహ్మశ్రీ రవిశంకర్ అవధాని, హనుమంతు శర్మ శాంతారాంభట్ల వేదమంత్రాలతో ప్రధాన అర్చకులు అర్జున శర్మ, ఇన్స్పెక్టర్ నాగ మల్లయ్యలచే గణపతి పూజ, పుణ్యాహవాచనం, మూలవిరాట్లకు విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చంద్రగ్రహణ అనంతరం ఈ పూజలను నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు.