బెజ్జూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడ అసంపూర్తిగా ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ప్రహరీ గోడ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. మెయిన్ గేటు గోడ లేకపోవడంతో కళాశాల ప్రాంగణంలోకి పశువులు రావడంతో పాటు ఆకతాయిలకు అడ్డాగా మారిపోయిందని విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు,