కంది మండలం కవలంపేట గ్రామంలో గురువారం ప్రమాదవశాత్తు చెరువులో పడి మహమ్మద్ ఫిరోజ్ (30) అనే యువకుడు మృతి చెందాడు. ఈనెల 23వ తేదీన ఇంట్లోంచి వెళ్లిపోయిన ఫిరోజ్ కోసం కుటుంబ సభ్యులు వెతికారు. సమాచారం లభించకపోవడంతో రెండు రోజుల క్రితం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉదం చెరువులో గొర్రె కాపర్లు తేలిన మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఫిరోజ్ గా గుర్తించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.