Araku Valley, Alluri Sitharama Raju | Aug 23, 2025
అరకులోయలో శనివారం మధ్యాహ్నం చేపట్టిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఆర్టీసీ విజయనగరం జోన్ ఛైర్మన్ సియ్యారి దొన్నుదొర పాల్గొన్నారు. ఎంపీడీవో ఆఫీస్ నుంచి ప్రధాన కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. గిరిజన మ్యుజియంలోని చెత్తను తొలగించి, ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ వాడవద్దని పేర్కొన్నారు. ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ పడవేయవద్దని ఎంపీడీవో లవరాజు సూచించారు.