నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లె గ్రామ పరిధిలోని ఆక్వా ప్లాంట్ మోరీల వద్ద బైక్ని ఆటో ఢీకొన్న ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గంగవరారానికి చెందిన వ్యక్తి గాజులపల్లె నుంచి స్వగ్రామానికి బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో నంద్యాల-గాజులపల్లె జాతీయ రహదారిపై వద్ద గుర్తు తెలియని ఆటో ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.