నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలో వద్ద యూరియా కోసం రైతులు రాత్రంతా పడిగా పుల్కాస్తున్నట్లు తెలిపారు. సోమవారం ఉదయం రైతులు తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారుజామున నుంచి కూడా క్యూలో నిలబడినప్పటికీ చాలామందికి యూరియా దొరకడం లేదని సకాలంలో అందించకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో యూరియాను అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.