ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దొడ్డం పల్లె గ్రామంలో సోమవారం ఓవర్గంపై మరో వర్గం దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటున్నా నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య భేదభిప్రాయాలు తలెత్తాయి. దీంతో ఓవర్గం మరో వర్గం పై దాడి చేయడంతో ముగ్గురు తీవ్రంగాను మరో ఇద్దరు స్వల్పంగాను గాయపడ్డారు గాయపడ్డ వారందరినీ 108 అంబులెన్స్లలో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని గిద్దలూరు అర్బన్ సిఐ సురేష్ తెలిపారు.