భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% శాతం టారిఫ్ పెంచడం దుర్మార్గం అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ అన్నారు. శనివారం సాయంత్రం నగరంలోని లాలాపేట హిమనీ సెంటర్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మీడియా జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ భారత్ కు ట్రంప్ తీవ్రమైన టాక్స్ లతో నష్టం చేకూరుస్తుంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ కనీసం స్పందించకపోవడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. తక్షణమే భారత్ పై విధించిన 50% శాతం సుంకాలను విరిమింప చేసుకోవాలని జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.