గుడివాడలో విద్యుత్ తీగలు పడి గొర్రెలు మృతి స్తానిక గుడివాడ జగనన్న కాలనీలో తెగిపడిన విద్యుత్తీగలు కింద పడటంతో రెండు గొర్రెలు, చేపలు, పాములు చనిపోయాయి. ఈ ఘటనతో సోమవారం మద్యాహ్నం 3 గంటల సమయంలో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి, తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. స్మార్ట్ మీటర్లు బిగించడంలో చూపించిన శ్రద్ధ విద్యుత్ తీగల విషయంలో లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.