ఈఓఐ పేరుతో స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాలని స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షులు జె అయోధ్యరామ్ డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ కొవ్వొత్తుల జంక్షన్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 11 వ తారీఖున జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జె అయోధ్య రామ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, స్థానిక స్టీల్ యాజమాన్యం అనైతికంగా స్టీల్ కార్మికులకు చెల్లించాల్సిన జీతాలను చెల్లించకుండా అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న యాజమాన్య తీరును విమర్శించారు.